రెండు వారాల్లో మోడీ కేంద్రకేబినెట్ విస్తరణ..

దేశాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలని పట్టుదలగా ఉన్న మోడీ… అందుకు దగ్గట్టే పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. పని విషయంలో కేబినెట్ సహచరులకు కీలక సూచనలు చేసిన ఆయన.. త్వరలో విస్తరణ చేపట్టబోతున్నారు. అన్నీ కుదిరితే రక్షణశాఖ అమిత్‌షాకు దక్కే అవకాశం ఉంది.

పాలనలో తనదైన మార్క్ చూపించేందుకు తొలిరోజు నుంచి సీరియస్‌గా పనిచేస్తున్నారు నరేంద్రమోడీ. దస్‌ కా దమ్ అంటూ ఇప్పటికే కేబినెట్ మిత్రులకు పదిసూత్రాల ఫార్ములాను పంపిన ఆయన.. త్వరలో కేబినెట్ విస్తరణకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ దఫా 25 మందికి పదవులు రావచ్చని అంచనా. వీటిల్లో 90 శాతం సహాయ మంత్రి పదవులే ఉండొచ్చు. శివసేన, టీడీపీలకు ఈసారి ఆశించిన స్థాయిలో బెర్తులు దక్కే అవకాశం ఉంది. అటు, రక్షణ శాఖ మంత్రిగా మురళీ మనోహర్ జోషీకి చోటు దక్కుతుందని వార్తలొచ్చినా.. ఆ లెక్క మారినట్టే ఉంది. 75 ఏళ్లు దాటిన వాళ్లను మోడీ తన కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. తన నమ్మినబంటు అమిత్‌షాకు డిఫెన్స్ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలిచిన మోడీ.. వడోదర ఎంపీగా రాజీనామా చేయనున్నారు. అక్కడి నుంచి ఎంపీగా అమిత్‌ షాను పోటీ చేయించి ఆయన్ను కేబినెట్‌లో తీసుకోనున్నారు. జూన్‌ 4 నుంచి 12 వరకూ జరిగే పార్లమెంట్ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండనుంది. అప్పుడు అమిత్‌షాకు రక్షణశాఖ పగ్గాలివ్వొచ్చు. యూపీలో బీజేపీ ఏకంగా 71 ఎంపీ సీట్లు గెలిచిందంటే అదంతా షా గొప్పతనమే కాబట్టి.. ఆయనకు సముచిత స్థానం దక్కడం ఖాయం.

అటు, త్వరలో పార్టీలోనూ కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఒక వ్యక్తికి ఒక పదవి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నందున.. అధ్యక్షుడు మొదలు పలువురిని కొత్తగా నియమించాల్సి వస్తోంది. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్‌ ప్లేస్‌లో మరొకర్ని ప్రెసిడెంట్‌గా నియమించాలి. అలాగే కేబినెట్‌లో పదవులు పొందిన ఉమాభారతి, స్మృతి ఇరానీ, అనంత్‌కుమార్‌, జవదేకర్‌, నిర్మలాసీతారామన్‌ సహా మరికొందరి ప్లేస్‌లో వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కూడా మోడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవి రేస్‌లో జేపీ నడ్డా, ఓం మాథుర్‌లతోపాటు అమిత్ షా పేరు కూడా వినిపించినా ఇప్పుడు లెక్కలు మారాయి. వీలైనంత తొందర్లో ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదం ఉన్న వ్యక్తికి పార్టీ పగ్గాలప్పగించే కసరత్తు జోరుగా జరుగుతోంది. మొత్తంమీద పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వ్యవహారాలన్నీ తన కనుసన్నలో ఉండేలా చూసుకోవడంలో మోడీ సక్సెస్ అయ్యారని అంటున్నారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s