కేసీఆర్‌ కేబినెట్‌ : నాయినికి హోం.. డిప్యూటీలుగా మహ్మద్‌అలీ, కొప్పుల..

కేసీఆర్‌ కేబినెట్‌ దాదాపు ఖరారైంది. అయితే పద్నాల్గు మందితో కలసి ప్రమాణ స్వీకారం చేయడమా ? లేదా ఐదుగురితోనే తంతు ముగించడమా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రేపు రాత్రికి గవర్నర్‌కు మంత్రివర్గ సభ్యుల జాబితాను అందించేందుకు టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మంత్రి పదవి ఇచ్చేయోచనలో గులాబీ చీఫ్‌ ఉన్నా… ముఖ్యనేతలకు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం.

m2

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సమయం దగ్గర పడింది. ఆరోజే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్‌ మంత్రులు కూడా పదవీ ప్రమాణం చేయనున్నారు. కేసీఆర్‌ ఇప్పటికే తన టీమ్‌పై కసరత్తు దాదాపు పూర్తి చేశారు. సోమవారం ఉదయమే కృతువు ఉండటంతో ఆదివారం రాత్రే మంత్రుల జాబితా గవర్నర్‌కు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

సోమవారం కేసీఆర్‌తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సుంది. ఒకవేళ కూర్పు పూర్తికాకపోతే ఐదు మంది కేబినెట్‌ సభ్యులు ప్రమాణం చేయొచ్చు. ఇంతకీ ఏఏ శాఖలు ఎవరికి కేటాయించారు ? ఎవరెవరికి పదవులు దక్కనున్నాయి ? అంతా గోప్యంగానే జరుగుతోంది. పదవుల కేటాయింపులపై కేసీఆర్‌ కొద్ది మంది ఆంతరంగీకులతో మాత్రమే చర్చిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్‌, హరీష్‌రావు, నాయని లాంటి వారితో చర్చించే మంత్రివర్గాన్ని కూరుస్తున్నారు. అయితే జిల్లాకు ఒకరికి అవకాశం ఇవ్వొచ్చన్నది మాత్రం వాస్తవ రూపం దాల్చుతున్నట్లు సమాచారం.

శాఖల కేటాయింపుల విషయానికొస్తే డిప్యూటీ సీఎంలుగా మహ్మద్‌ అలి, కొప్పుల ఈశ్వర్‌ల పేర్లు ఖరారయ్యాయి. ఇక శాఖలను చూస్తే హరీష్‌రావుకు నీటి పారుదల, విద్యుత్‌ శాఖలు దక్కే అవకాశం ఉంది. కేటీఆర్‌కు ఐటీ, ఇండస్ట్రీస్‌, ఈటెల రాజేందర్‌కు రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ, జలగం వెంకట్రావుకు రోడ్లు భవనాలు, జగదీశ్వర్‌రెడ్డికి పంచాయతీరాజ్‌ శాఖలు ఇచ్చే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. పోచారం శ్రీనివాసరెడ్డికి గ్రామీణ అభివృద్ధి లేదా వాణిజ్యశాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ, రాజయ్యకు వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే ఛాన్సుంది. ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు కార్మిక, ఉపాధి శాఖ ఇచ్చేందుకు కేసీఆర్‌ సుముఖంగా ఉన్నారు. మరో ఉద్యమ నేత శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి వస్తుందా? రాదా ? అన్నది సస్పెన్స్‌గా ఉంది.

హైదరాబాద్‌ నుంచి గెలిచిన ఏకైక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మారావును మంత్రి పదవి వరించనుంది. మహిళా కోటా కింద పద్మా దేవందర్‌రెడ్డి, కొండా సురేఖల పేర్లు పరిశీలనలో ఉన్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎస్టీ కోటాలో చందూలాల్‌, రేఖా నాయక్‌, కోవా లక్ష్మిలలో ఒకరికి అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్‌ సిద్దంగా ఉన్నారు. ఇక కీలకమైన హోంశాఖను నాయని నర్సింహారెడ్డి లాంటి సీనియర్‌ నేతకు కేటాయించాలన్నది టీఆర్‌ఎస్‌ ఆలోచన. అటు స్పీకర్‌ పదవికి కూడా నాయని పేరు వినిపిస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి లక్ష్మారెడ్డి, వరంగల్‌ నుంచి మధుసూదనాచారి, నిజామాబాద్‌ నుంచి గంపా గోవర్ధన్‌, ఏనుగు రవీందర్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s