ఢిల్లీ టూర్ సక్సెస్‌తో చంద్రబాబులో సంతోషం..

ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు… రాష్ట్ర ప్రగతిపై ముందస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, జలవనరులు, ఆర్థిక ప్యాకేజీల కోసం ఢిల్లీ పెద్దల్ని కలుస్తున్నారు. అటు ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉండటంతో తన ప్రమాణ స్వీకారానికి రావాలని కమలనాధుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. నిన్న క్షణం తీరికలేకుండా గడిపిన చంద్రబాబు… మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

m1

ఢిల్లీ టూర్‌లో ఉన్న టీడీపీ చీఫ్‌ చంద్రబాబు.. బిజీబిజీగా గడిపారు. ఉదయం హస్తినలో ఫ్లైట్‌ దిగింది మొదలు… ప్రధాని మోడీ, ఇతర క్యాబినెట్‌ మంత్రుల దగ్గరకు చక్కర్లకు కొట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే… కేంద్రం నుంచి అవసరమైన సాయం కోసం వినతి చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌జైట్లీ, జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి, ప్రణాళికాశాఖా మంత్రి ఇంద్రజిత్‌సింగ్‌, మానవ వనరులశాఖా మంత్రి స్మృతి ఇరానీని కలిశారు.

మోడీతో భేటీ అయిన బాబు.. రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అందాల్సిన ఆర్థిక సహాయాన్ని త్వరితగతిన ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి సాయం తగిన సమయంలో అందితేనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయాన్ని మోడీకి విన్నవించారు. దీనిపై మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అటు జూన్‌ ఎనిమిదిన ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు… ఆ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించారు.

ఆర్థికశాఖామంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన చంద్రబాబు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను ఏకరువు పెట్టారు. కొత్త రాష్ట్రానికి ఇచ్చిన రాయతీలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్‌ తరహాలో ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. లోటు బడ్జెట్‌ దృష్ట్యా ఉద్యోగుల జీత భత్యాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిధులు విడుదల చేయాలని వినతి చేశారు.

కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతితో భేటీ అయిన బాబు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీని ప్రకటించాలని కోరారు. జలవనరులపై ఉన్నత స్థాయి కమిటీ వేయడంతోపాటు తుంగభద్ర, కృష్ణా, గోదావరి బోర్డులను ప్రకటించాలన్న విన్నవించారు. అటు ప్రణాళికా శాఖ మంత్రి ఇందర్‌జిత్‌సింగ్‌కు విభజన సమస్యలపై నివేదిక అందించారు. ప్రత్యేక హోదా కల్పించే అంశంపై చర్చించారు. ప్రత్యేక ప్యాకేజీ, ప్రోత్సాహకాల అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. హెచ్‌ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీని కలసిన బాబు.. సెంట్రల్‌ యూనివర్సిటీలు, విద్యా సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు.

అటు పలువురు బీజేపీ సీనియర్లను కలిసిన చంద్రబాబ ప్రమాణ స్వీకారానికి రావాలని స్వయంగా ఆహ్వానించి వచ్చారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s