తెలంగాణ ఆవిర్భావోత్సవానికి భారీ ఏర్పాట్లు…. వేడుకలకు ముస్తాబవుతున్న 10 జిల్లాలు..

 • జూన్ రెండు తెలంగాణ పండగరోజు
 • తెలంగాణ ఆవిర్భావం, కేసీఆర్ ప్రమాణం
 • భారీ ఏర్పాట్లలో మునిగిపోయిన గులాబీదళం
 • న భూతో న భవిష్యత్ అన్న రేంజులో ఏర్పాట్లు
 • హైద్రాబాద్ లో ధూంధాంగా ఏర్పాట్లు
 • జూన్ ఒకటి అర్థరాత్రి నుంచి సంబరాలు
 • భాగ్యనగరంలో బాణాసంచా వెలుగులు
 • హైద్రాబాద్ మొత్తం గులాబీమయం
 • 25చోట్ల భారీ కేసీఆర్ కటౌట్లు
 • ఉర్రూతలూగించనున్న కల్చరల్ ఈవెంట్స్
 • అబిడ్స్‌ నుంచి గన్‌పార్క్‌ వరకు భారీ ర్యాలీ
 • ఏడున్నరకు గన్ పార్క్ వద్ద కేసీఆర్ నివాళి
 • 8.15లకు సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
 • 10.45లకు పరేడ్ గ్రౌండ్ కు హాజరు
 • 12.55లకు సచివాలయంలో బాధ్యతలు
 • అమరుల కుటుంబాలకు ఆర్థికసాయం, రైతు రుణమాఫీ ఫైళ్లపై సంతకాలు

m9

ఓవైపు తెలంగాణ ఆవిర్భావం.. మరోవైపు తొలి సీఎంగా కేసీఆర్ ప్రమాణం. జూన్ రెండున తెలంగాణ వ్యాప్తంగా అంబరాన్నంటే సంబరాలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. హైద్రాబాద్ నగరాన్ని గులాబీమయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణ పది జిల్లాల్లో వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

జూన్‌ 2.. తెలంగాణకు పండగరోజు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం.. కేసీఆర్ ప్రమాణోత్సవాన్ని నభూతో నభవిష్యత్ అన్న రేంజులో నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. 60ఏళ్ల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాన్ని చరిత్ర పుటల్లో పదిలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ పది జిల్లాల్లో జాతీయ, తెలంగాణ పతకాలను ఎగరవేసి.. వాడవాడలా సంబరాలు నిర్వహించనున్నారు.

ఇక భాగ్యనగరంలో అయితే ధూంధాంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ ఒకటి మిడ్ నైట్ నుంచి ట్యాంక్‌బండ్‌, పీపుల్స్‌ ప్లాజా వేదికగా సంబరాలు ఆరంభం కానున్నాయి. ముంబై, హైద్రాబాద్ కు చెందిన ఫైర్ వర్క్స్ నిపుణులు.. బాణాసంచా వెలుగుల్లో హైద్రాబాద్ నగరాన్ని ముంచెత్తనున్నారు.

అంతేకాదు హైద్రాబాద్లో నలుదిక్కులా 150ప్రధాన సెంటర్లను గులాబీమయం చేయనున్నారు. 25చోట్ల కేసీఆర్ భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలతో  ఉర్రూతలూగించనున్నారు. అబిడ్స్‌ నుంచి గన్‌పార్క్‌ వరకు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉదయం ఏడున్నరకు భారీ జనసందోహం మధ్య KCR గన్ పార్క్ చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పిస్తారు. అక్కడి నుంచి 8గంటల15నిమిషాలకు రాజ్‌భవన్‌కు వెళ్లి తెలంగాణ తొలి సీఎంగా నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం 10గంటల 45నిమిషాలకు ముఖ్యమంత్రి హోదాలో పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ర్ట అవతరణ వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొంటారు. 12గంటల 57నిమిషాలకు సచివాలయంలోని సమతా బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరిస్తారు. అమరుల కుటుంబాలకు ఆర్థికసాయం, రైతు రుణమాఫీతో పాటు మరికొన్ని ఎన్నికల హామీల ఫైళ్లపై తొలి సంతకాలు చేయబోతున్నారు కేసీఆర్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను.. తొలి సీఎంగా కేసీఆర్ ప్రమాణోత్సవాన్ని కనివినీ ఎరుగని రీతిలో చేసేందుకు గులాబీదళం సిద్దమైంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s