కేసీఆర్‌ సర్కార్ : అధికారులకు శాఖలు, సలహాదారుల నియామకం

తెలంగాణలో కొత్త సర్కారు కొలువుదీరిన రోజే కీలకమైన నియామకాలన్నీ పూర్తయ్యాయి. 36 మంది ఐఏఎస్‌, 26 మంది ఐపీఎస్‌ అధికారులకు శాఖల కేటాయింపు పూర్తి చేసిన కేసీఆర్‌ ప్రభుత్వం… కీలక శాఖల్లో మెరుగైన అభివృద్ధి సాధించేందుకు ఆయా రంగాల్లో నిపుణులైన వారిని సలహాదారులుగా నియమించింది. వీలైనంత త్వరగా పాలనను పట్టాలకెక్కించి… కార్యాచరణ మొదలుపెట్టాలని కేసీఆర్‌ అండ్‌ టీం కృత నిశ్చయంతో ఉంది.

తెలంగాణ సర్కారు కొలువుదీరింది. కేసీఆర్‌ నేతృత్వంలో 11 మంది మంత్రులు పదవీ ప్రమాణాలు చేశారు. ఆ వెంటనే క్యాబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చూచాయగా ప్రాధాన్య అంశాలేంటన్నదీ చర్చించారు. ఇక అత్యంత కీలకమైన అధికారుల నియామక ప్రక్రియ కూడా మొదటి రోజే పూర్తి చేసి.. ఒక్కరోజు కూడా సమయం వృధా కాకుండా చూశారు. 36 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్‌ ఇచ్చిన కేసీఆర్‌ సర్కారు…. బీపీ ఆచార్యను  ప్లానింగ్‌ శాఖ, టూరిజం, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించారు. వి.నాగిరెడ్డికి కీలకమైన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పదవి దక్కింది. రేమండ్‌ పీటర్‌ను పర్యావరణ, అటవీశాఖలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించారు. సురేశ్‌ చందాకు తెలంగాణ ట్రాన్స్ కో చైర్మన్ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌తో పాటు తెలంగాణ జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవి లభించింది. బీఆర్‌ మీనా రెవెన్యూ శాఖలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. పూనం మాలకొండయ్యకు వ్యవసాయ, సహకార శాఖలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ పదవి దక్కింది. కె.రామకృష్ణారావును ఆర్థిక శాఖలో స్పెషల్‌ సెక్రటరీగా నియమించారు. పార్థసారథికి పౌరసరఫరా శాఖ కమిషనర్‌ పదవి దక్కింది. సవ్యసాచి ఘోష్‌ను పరిశ్రమలు, వాణిజ్య శాఖల కార్యదర్శిగా నియమించారు. బి.వెంకటేశం హౌసింగ్‌ కార్పొరేషన్ వైస్‌ చైర్మన్‌, ఎండీగా నియమితులయ్యారు. ఇక మిగతా వారి వివరాలు ఇలా ఉన్నాయి..

అటు 26 మంది ఐపీఎస్‌ అధికారులకూ మొదటి రోజే పోస్టింగులు ఇచ్చేశారు. రాజీవ్‌ త్రివేదిని ఆక్టోపస్‌ అదనపు డీజీగా నియమించారు. విజిలెన్స్‌ డైరెక్టర్‌గా అమిత్‌ గార్గ్‌, పోలీస్‌ సిబ్బంది వ్యవహారాల అదనపు డీజీగా ఉమేష్‌ షరాఫ్‌, జైళ్ల శాఖ డీజీగా వీకే సింగ్‌, ఎస్‌పీఎఫ్‌ డీజీగా తేజ్‌దీప్‌ కౌర్‌, శాంతి భద్రతల ఐజీగా రాజీవ్‌ రతన్‌, సీఐడీ అదనపు డీజీ కృష్ణ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఇక రైల్వేస్‌ ఐజీగా కేటీ ఉజేలాకు పోస్టింగ్‌ ఇవ్వగా… పోలీస్‌ శిక్షణ బాధ్యతలు స్వాతి లక్రాకు అప్పగించారు. ఏసీబీ డైరెక్టర్‌ గా కుమార్‌ విశ్వజిత్‌, గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండ్‌గా కార్తికేయను నియమించారు.

ఇక వివిధ రంగాల్లో నిపుణులైన ఆరుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు.  ఏకే గోయల్‌, కేవీ రమణాచారి, ఆర్‌ విద్యాసాగర్‌ రావు, రామలక్ష్మణ్‌, పాపారావు, బీఆర్ రెడ్డిని సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరు ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. వీరిలో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కాగా.. ఒకరు IES అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. నీటిపారుదల, విద్యుత్, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో నిపుణులైన వీరి సలహాలతో మరింత మెరుగైన పాలన అందించేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s