మోడీ మార్క్‌ రూల్స్‌ : కష్టపడి పనిచేయండి – ప్రగతి సాధించండి

ఎంతటివారైనా కష్టపడి పనిచేయాల్సిందే.. ప్రతీ 100రోజులకు రిపోర్ట్‌ కార్డ్‌ ఇవ్వాల్సిందే.. బంధువు, గిందువు జాన్తా నై.. ఇది ప్రధాని నరేంద్రమోడీ.. సహచర మంత్రులకు ఇస్తున్న ఆదేశాలు. అవినీతి నిర్మూలనకు చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్న మోడీ.. అన్నిశాఖలను ప్రక్షాళించే పనిలో పడ్డారు. సీనియర్‌, జూనియర్‌ అని తేడాలేకుండా.. అందరికీ స్ట్రిక్ట్‌గా రూల్స్‌ పాస్‌ చేస్తున్నారు. 

మినిమమ్‌ గవర్నమెంట్‌.. మ్యాగ్జిమ్‌ గవర్నెన్స్‌ నినాదంతో పాలన ప్రారంభించిన మోడీ.. దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు. తాను మాటల మినిషినికాదు.. చేతల్లో చూపించే నిజమైన లీడర్‌నంటూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే నల్లధనంపై సిట్‌ను ఏర్పాటు చేసి.. మార్గదర్శకాలు విడుదల చేసిన మోడీ.. అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదనే సంకేతాలు పంపారు. బంధుప్రీతికి దూరంగా ఉండాలంటూ సహచర మంత్రివర్గ సభ్యులకు సీరియస్‌గా ఆదేశాలు జారీచేసిన ఆయన.. వ్యవస్థనంతా గాడిలోపెట్టి.. సంక్షేమంపై దృష్టిపెట్టే వ్యూహంతో ముందుకెళుతున్నారు.

ఎన్నికల్లో గెలవడానికి కల్లబొల్లి హామీలు ఇచ్చి.. ఆ తర్వాత వాటిని పక్కనబెట్టే నేతలకు తాను పూర్తి విరుద్ధమని స్పష్టంచేశారు మోడీ. చేసేదే చెబుతా.. చెప్పిందే చేస్తానన్నట్లు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా అడుగులు వేస్తున్న మోడీ.. సహచర మంత్రులకు కూడా టార్గెట్‌ సెట్‌ చేశారు. ప్రతీ మంత్రి కష్టపడి పనిచేసేలా 100 రోజుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. యూపీఏ హయాంలో ఏర్పాటు చేసిన 60 కమిటీలను రద్దు చేసి.. అవినీతికి తావులేకుండా వ్యవహరిస్తున్నారు. సోమవారం తన మంత్రివర్గంలోని 45 మంది మంత్రులతో సమావేశమైన మోడీ.. సుదీర్ఘంగా చర్చించారు. దేశాభివృద్ధి కోసం అంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో.. ఆర్థికవ్యవస్థ ఉత్తేజానికి తీసుకోవాల్సిన చర్యలు.. మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై తన ఆలోచలను సహచరులకు వివరించారు. చేపట్టిన పనులు నిర్ణీతకాలంలో పూర్తి అవుతున్నాయో లేదో తేలాలంటే ప్రతీ 100 రోజులకు రిపోర్ట్‌ కార్డ్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

తన ఉద్దేశాలనే సహచర మంత్రులపై రుద్దకుండా.. వారి ఆలోచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నారు మోడీ. పాలనలో ఏదైనా లోపం ఉన్నట్లైతే నిక్కచ్చిగా చెప్పేయాలని సహచరులకు సూచించారు. 100 రోజుల అజెండాపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన మోడీ.. గత ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ప్రాజెక్ట్‌ల ప్రగతిపై నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. మంత్రులను, ఆయా శాఖల కార్యదర్శులను తాను ఎప్పటికప్పుడూ కలుస్తుంటానని.. ఎంతటివారైనా కష్టపడి పనిచేయాల్సిందేని తేల్చిచెప్పారు. సోమవారం కేబినెట్‌ సహచరులకు స్ట్రిక్ట్‌ ఆదేశాలు ఇచ్చి.. లక్ష్యం నిర్ధేశించిన మోడీ.. ఇవాళ కేంద్రప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అధికారుల స్థాయి నుంచి పాలన బలోపేతానికి చర్యలు తీసుకోనున్నారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s