మెదక్‌ ఎంపీ సీటుపై కన్నేసిన బీజేపీ… యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్న కమల దళం

మెదక్‌ ఎంపీ సీటుపై బీజేపీ కన్నేసింది. ఎలాగైనా మెదక్‌లో జెండా పాతేయాలని కమలం తహతహలాడుతోంది. ఇంతకు బీజేపీ తరఫున బరిలో నిలిచేది ఎవరు..? టీఆర్‌ఎస్‌ కంచుకోటను బద్దలుగొట్టే సత్తా బీజేపీకి ఉందా.? మెదక్‌ సీటుపై బీజేపీకి ఎక్స్‌పర్టేషన్స్‌ ఎందుకు పెరిగాయి..?

దేశమంతా మోడీ గాలి వీచింది. హేమాహేమీలు నమో హవాతో కొట్టుకుపోయారు. 125ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ చాలాప్రాంతాల్లో తుడిచిపెట్టుకుపోయింది. కానీ తెలంగాణలో మాత్రం ఫలితాలు భిన్నంగా వచ్చాయి. కారు యమహోరుగా దూసుకుపోగా.. భారీగా ఆశలుపెట్టుకున్న కమలం వికసించలేదు. అత్యధికస్థానాలు గెలిచి తెలంగాణలో పెద్దపార్టీగా మారాలన్న కల ఫలించలేదు. ఫలితంగా కేంద్ర మంత్రివర్గంలో కూడా ఈ ప్రాంత నేతలకు చోటు దొరకలేదు. ఈ నేపథ్యంలో మెదక్‌ ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు.. కేసీఆర్‌ వదిలిన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా మెదక్‌ లోక్‌సభను గెలుచుకుని పార్టీ అగ్రనాయకత్వం వద్దకు సగర్వంగా వెళ్లాలని చూస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ కంచుకోటైన మెదక్‌ను కైవసం చేసుకోవడం అంత తేలికకాదని లెక్కలు వేస్తున్న బీజేపీ నేతలు.. ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నారు. కేసీఆర్‌ చేతిలో ఓడిపోయిన నరేంద్రనాథ్‌కు స్థానికంగా సానుభూతి ఉన్నా.. అది ఎంతవరకు గెలుపు ఇస్తుందో చెప్పలేని పరిస్థితి. దీంతో లాటరీ వేయకుండా.. సర్వశక్తులు ఒడ్డాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. సికింద్రాబాద్‌ సీటును ఆశించి.. దక్కించుకోలేకపోయిన కిషన్‌రెడ్డి.. మెదక్‌ నుంచి పోటీకి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేంద్రస్థాయికి వెళ్లాలన్నది కిషన్‌రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయస్థాయి నేతలతో దీనిపై మాట్లాడిన కిషన్‌రెడ్డి.. పెద్దల నుంచి అభయం పొందారని పార్టీవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అప్పుడే రంగంలోకి దిగి.. గ్రౌండ్‌వర్క్‌ మొదలుపెట్టేశారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో.. రహస్యంగా సర్వే చేయించుకున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి.. కిషన్‌రెడ్డి పట్ల ప్రజల భావన.. ఇలా అనేక కోణాల్లో వివరాలు సేకరించారు.

మెదక్‌ లోక్‌సభ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ రావడానికి ఇంకా సమయం ఉండటంతో.. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. కేసీఆర్‌ సీఎం హోదాలో ఉండటంతో.. ప్రభుత్వ తప్పులు, వాగ్దానాలు అమలు విషయంలో జాప్యం లాంటి అంశాలతో టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేయాలని చూస్తున్నారు. ప్రతీతప్పును ఎండగడుతూ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ బలాన్ని తగ్గించి.. గెలుపునకు బాటలు వేసుకోవాలని లెక్కలు వేస్తున్నారు. ఇక జాతీయస్థాయి నేతలపైన రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌తో ప్రచారం చేయించే విషయాన్ని అప్పుడే నేతల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. తెలంగాణ చిన్నమ్మగా.. లోక్‌సభలో బిల్లు సమయంలో కీలకంగా వ్యహరించిన సుష్మాకు ప్రజల్లో మంచిపేరు ఉండటం.. కలిసి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా మెదక్‌ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ బీజేపీ సర్వప్రయన్నాలు చేస్తోంది. ఇప్పటి నుంచే యాక్షన్‌ప్లాన్‌తో రంగంలోకి దిగుతోంది.

Advertisements
Video | This entry was posted in Hyderabad News, Telangana and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s