విజయవాడలోనే ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ?

  • విజయవాడలోనే ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ?
  • బెజవాడలో అన్ని సౌకర్యాలు ఉన్నాయంటున్న నిపుణులు
  • నిపుణుల సూచనలు ధృవీకరిస్తున్న ఆర్టీసీ అధికారులు

నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ సంస్థను విజయవాడలోనే ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్‌గా పేరున్న పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ ప్రధాన కార్యాలయానికి అన్నివిధాలా సరిపోతుందని చెప్తున్నారు. అంతేకాకుండా సంస్థ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ధృవీకరిస్తున్నారు.

నవ్యాంధప్రదేశ్‌ రాజధానిగా విజయవాడ, గుంటూరును కలిపి జంట నగరాలుగా అభివృద్ది చేయడానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. ఈ నేపధ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో రోడ్డురవాణా సంస్థ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని ఆర్‌టిసి అధికారులు, కార్మికసంఘ నేతలు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 25 డిపోలు 3,800 బస్సులతో గ్రేటర్ జోన్‌గా అభివద్ధి చేశారు. అదే విధంగా విజయవాడ, గుంటూరు నగరాలను కలపడం, అవసరాన్ని బట్టి కొత్త డిపోలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్టీసీని అభివృద్ధి చేయాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణాజిల్లాలోని గన్నవరం, ఉయ్యూరు, గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరి డిపోలను తక్షణమే నగర డిపోలుగా మార్చడంతోపాటు అవసరమైన చోట కొత్త డిపోలు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల నేతలు ప్రతిపాదిస్తున్నారు. అదే విధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మూసివేసిన డిపోలను వెంటనే తెరిపించాలని కూడా కోరుతున్నారు. అంతే కాకుండా సీమాంధ్ర ఆర్‌టిసి ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయని ఇటు అధికారులు, అటు కార్మిక సంఘాల నాయకులు భావిస్తున్నారు. అవసరమైన మేరకు బస్‌డిపో  పరిధిని పెంచుకోవడానికి కూడా విజయవాడలో సదుపాయం ఉందని ఆర్‌టిసి అధికారులు చెప్తున్నారు.

విజయవాడలో పండిట్ నెహ్రు బస్‌స్టేషన్‌తో పాటు గవర్నర్‌పేట, విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం, ఆటోనగర్ బస్‌డిపోలు ఉన్నాయి. వీటిలో ఆటోనగర్ బస్‌డిపో నుండి 90 శాతం బస్సులు దూరప్రాంతాలకు వెళ్తాయి. గుంటూరులో ఒక్క బస్‌డిపో మాత్రమే ఉంది. పైగా సిటీ సర్వీసులు కూడా అందుబాటులో లేకపోవడంతో విజయవాడ బస్‌స్టేషన్‌ను ప్రధాన కార్యాలయంగా మార్చాలనే వాదన వినిపిస్తోంది. పైగా రవాణా రంగ ఆదాయంలో విజయవాడ ఆర్‌టిసి ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ నేపధ్యంలో విజయవాడలో ఆర్‌టిసి ప్రధాన కార్యాలయం నెలకొల్పాలని సంస్థ ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s