లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్

  • లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్
  • అధికారికంగా ప్రకటించడమే తరువాయి..
  • ఇండోర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుమిత్ర
  • 8సార్లు ఎంపీగా గెలిచిన అనుభవం
  • బీజేపీలో తెలివైన నాయకురాలిగా గుర్తింపు
  • ఇప్పటికే కేబినెట్లో మహిళలకు పెద్దపీట
  • స్పీకర్ పోస్టుకూడా మహిళకే ఇవ్వాలని మోడీ యోచన

భారత పార్లమెంటరీ వ్యవస్థలో లోక్ సభ స్పీకర్ స్థానానికి ప్రత్యేక స్ధానముంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవి లోక్ సభ స్పీకర్ పోస్టే. ప్రస్తుత సభకు సభాధ్యక్షురాలిగా బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ పేరును దాదాపుగా ఖరారు చేశారు.

16వ లోక్ సభ స్పీకర్ గా బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ పేరు దాదాపుగా ఖరారు అయింది.  పార్లమెంటరీ వ్యవహారాల్లో  విశేష అనుభవం ఉన్న ఆమెను శుక్రవారం జరిగే పార్లమెంటు సమావేశాల్లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సుమిత్ర..బీజేపీలో కీలక నేతల్లో ఒకరు. ఇండోర్ నియోజకవర్గం నుంచి వరుసగా 8వసారి ఎంపీగా గెలుపొందారు.1989లో తొలిసారి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. అది మొదలు ఇప్పటివరకూ ఓటమి ఎరగకుండా ప్రస్థానం సాగిస్తున్నారు.

వాజ్ పేయ్ హయాంలోనూ సుమిత్రకు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో చేజారింది. బాగా ఆలోచించిగానీ ఏ నిర్ణయమైనా తీసుకోరనే పేరు పార్టీలో సుమిత్రా మహాజన్‌కు ఉంది. లాయర్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె బీజేపీలో తనదైన ముద్ర వేశారు. స్థానిక ప్రజలు సుమిత్రను అక్క అంటూ ఆత్మీయంగా పిలుచుకుంటారు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. 2002-04 వరకు మానవ వనరులు, కమ్యూనికేషన్‌ పెట్రోలియం శాఖలకు సహాయ మంత్రిగా విధులు నిర్వహించారు.

యూపీఏ హయాంలో మీరాకుమార్ స్పీకర్ గా పనిచేయడంతో.. ఎన్డీఏ కూడా మహిళలకే సభాధ్యక్షురాలి స్థానం కట్టబెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమిత్రా మహాజన్ పేరును కమలం పార్టీ అగ్రనేతలు పరిశీలించినట్లు సమాచారం. ఇప్పటికే కేబినెట్లో మహిళలకు పెద్దపీట వేసిన మోడీ సర్కార్ స్పీకర్ పోస్టును కూడా వారికే కేటాయించి మరింతగా వారిని గౌరవించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s