అమెరికా టూర్‌కు మోడీ గ్రీన్‌ సిగ్నల్ … ఒబామా ఆహ్వానానికి నమో అంగీకారం

  • అమెరికా పర్యటకు మోడీ గ్రీన్ సిగ్నల్
  • ఒబామా ఆహ్వానానికి మోడీ అంగీకారం
  • సెఫ్టెంబర్ లో యూఎస్ టూర్ కు మోడీ
  • ద్వైపాక్షిక చర్చల్లో మోడీ, ఒబామా
  • కొత్త అధ్యయనానికి నాంది
  • త్వరలో మోడీ పర్యటన షెడ్యూల్
  • సెప్టెంబర్ 30న రావాలంటూ యూఎస్ ప్రతిపాదన
  • సెఫ్టెంబర్ 26న వచ్చేందుకు అంగీకారం?
  • త్వరలో అధికారిక ప్రకటన
  • ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయంటున్న నిపుణులు

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ చివర్లో ఈ టూర్ ఉండేలా కసరత్తు జరుగుతోంది. త్వరలో రెండు దేశాలకు సంబంధించిన అధికారులు ఇందుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఎట్టకేలకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో అమెరికా గడ్డపై అడుగుపెట్టనున్నారు. అధ్యక్షులు బరాక్ ఒబామా ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నరేంద్ర మోడీకి … ఒబామా ఫోన్ చేసి అభినందించిన విషయం తెలిసిందే. తమ దేశానికి రావాలంటూ మోడీని ఒబామా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సెఫ్టెంబర్ లో నరేంద్ర మోడీ అమెరికా వెళ్లనున్నారు. వాషింగ్టన్ లో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో  మోడీ, ఒబామా పాల్గొననున్నారు. దీంతో భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలకు కొత్త అధ్యయనం మొదలైందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మోడీ పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు కావాల్సి ఉంది.

అటు ప్రపంచంలో రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వీలుగా ఇరువురికి ఆమోదయోగ్యమైన సమయంలో రావాలని అందుకు సెఫ్టెంబర్ 30 అనువుగా ఉంటుందని అమెరికా అధికార వర్గాలు ప్రతిపాదించాయి. అయితే భారత్ అధికార వర్గాలు మాత్రం అదే నెల 26న వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా 2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో మోడీ పాత్ర ఉందన్న ఆరోపణలపై నరేంద్రుడి వీసాపై 2005లో అమెరికా నిషేధం విధించింది. ఆ నిషేధం మోడీ ప్రధాని పీఠం ఎక్కేవరకూ కొనసాగింది.
వాయిస్.  నరేంద్ర మోడీ యూఎస్ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్ల తర్వాత భారత్ లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడంతో అమెరికా సంబంధాలపై మరింత ఉత్కంఠ రేపుతోంది.

Advertisements
Video | This entry was posted in International, National and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s