క్యాథ్లీన్‌ స్టీఫెన్స్‌ భారత్‌లో అమెరికా తాత్కాలిక రాయభారిగా బాధ్యతలు స్వీకరించారు

భారత్‌లో అమెరికా తాత్కాలిక రాయభారిగా  నియమితులైన క్యాథ్లీన్‌ స్టీఫెన్స్‌ ఇవాళ ఛార్జ్‌ తీసుకున్నారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో  ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మార్చిలో నాన్సి పావెల్‌  పదవీకాలం ముగియటంతో  ఆమె ఈ నెల 22న అమెరికా వెళ్లిపోయారు. అధ్యక్షుడు ఒబామా పర్మనెంట్‌ అంబాసిడర్‌ను నియమించే వరకు క్యాథ్లీన్‌ ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా అన్నారు. నరేంద్రమోడీ నేతృత్వంలో భారత్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వంతో  స్నేహపూర్వకంగా కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యత ఇస్తామని నూతన రాయబారి అన్నారు.  అమెరికా – భారత్‌  మధ్య సంబంధాల బలోపేతానికి ఇరువైపుల నుంచి ప్రయత్నాలు ఇకపైనా  కొనసాగుతాయని అన్నారు. వ్యాపార, పెట్టుబడి ఆర్థిక సమగ్రత, ప్రాంతీయ రక్షణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతోపాటు ఇంకా పలు రంగాల అభివృద్ధికి భారతీయ భాగస్వాములతో కలిసి పనిచేయటం తనకు ఆసక్తి కలిగిస్తోందన్నారు. 1978-2013 మధ్య కాలంలో అమెరికా విదేశాంగ శాఖలో  పనిచేసిన క్యాథ్లీన్‌ 2008 నుంచి 2011 వరకు దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా పనిచేశారు.

 

Advertisements
Video | This entry was posted in International, National and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s