మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఆల్బమ్‌| గంగ్నమ్‌ స్టైల్‌ – రెండేళ్లైనా ఏ మాత్రం క్రేజ్‌ తగ్గకుండా కోట్లాది వ్యూలు

సౌత్‌కొరియన్‌ పాప్‌స్టార్‌ సై సృష్టించిన గంగ్నమ్‌ సునామీ కొనసాగుతోంది. రెండేళ్లైనా ఏ మాత్రం క్రేజ్‌ తగ్గకుండా కోట్లాది వ్యూలు సంపాదిస్తోంది. ఈ ఒక్కవారంలో గంగ్నమ్‌ను రెండు కోట్ల మంది చూశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కోట్లాది మంది గంగ్నమ్‌ స్టైల్‌ సాంగను చూడటం వల్ల ఎంత సమయం వృథా అయ్యింది.? ఎన్ని రోజులు వేస్ట్‌ అయ్యాయి..? ఒక్క సాంగ్‌ కోసం వృథా అయిన ఈ సమయంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించొచ్చు..?

 

గంగ్నమ్‌ డ్యాన్స్‌..ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆల్బమ్‌.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సాంగ్‌.. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుని.. మరికొన్ని రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన ఆల్బమ్‌గా ఆల్‌టైమ్‌ రికార్డ్‌ను నెలకొల్పింది..

2012 జులైలో విడుదలైన గంగ్నమ్‌ డ్యాన్స్‌ ఇప్పటికీ మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఆల్బమ్‌గా కొనసాగుతోంది. ఈ ఒక్కవారంలోనే రెండు బిలియన్ల మంది యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను చూశారు. గంగ్నమ్‌ క్రేజ్‌ ఇంకా చెక్కుచెదరలేదని నిరూపించారు. ఒక్కవారంలో ఇన్ని వ్యూవ్స్‌ వచ్చిన ఏకైక సాంగ్‌గా మరో రికార్డ్‌ను కట్టబెట్టారు.

సౌత్‌కొరియన్‌ పాప్‌స్టార్‌’ సై’ సృష్టించిన ఈ గంగ్నమ్‌ సునామీ గురించి వర్ణించడం అసాధ్యం. ఒక్కరా ఇద్దరా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈ సాంగ్‌ను చూశారు. అన్ని వ్యూవ్స్‌ను లెక్కకడితే.. గంగ్నమ్‌ స్టైల్‌ను సరాసరిన 140 మిలియన్ల గంటలపాటు చూశారు. ఈ సమయం విలువ ఎంతో తెలిస్తే షాక్‌ గురికాకతప్పదు. గంగ్నమ్‌ను చూసిన కోట్లాదిమంది నెటిజన్ల సమయాన్ని లెక్కిస్తే ఇది అక్షరాల 16వేల సంవత్సరాలకు సమానం..

16వేల సంవత్సరాల సమయమా.. బాప్‌ రే.. వాట్‌ ఏ గ్రేట్‌ రికార్డ్‌.. ఇలా ఎన్ని చెప్పినా గంగ్నమ్‌ గురించి తక్కువే. అయితే నాలుగు నిమిషాల సాంగ్‌ కోసం ఇంత సమయాన్ని వెచ్చించడం ఎంత నష్టం చేకూర్చింది..? ఇంత విలువైన సమయంలో మానవుడు ఎలాంటి అద్భుతాలు సృష్టించొచ్చు.. అంటే మాత్రం లెక్కలేనంత నష్టమే జరిగిందని చెప్పాలి. గంగ్నమ్‌ స్టైల్‌ను చూసిన సమయంలో ప్రపంచ అద్భుతాలను డజన్ల సంఖ్యలో సృష్టించొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఒక్కటైన ది అంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ లాంటివి ఏకంగా 20 కట్టొచ్చు.. అమెరికా వాణిజ్యరాజధాని న్యూయార్క్‌ నగరంలో ఉన్న ఈ భారీ భవనంలో 103 అంతస్తులు ఉన్నాయి. 381 మీటర్ల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే ఈ భారీ భవనం.. 40ఏళ్లపాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలిచింది.

మానవ అద్భుతంగా నీరాజనాలు అందుకుంటున్న బుర్జ్‌ ఖలీఫా లాంటి భవనాలను గంగ్నమ్‌ డ్యాన్స్‌ కోసం వెచ్చించిన సమయాన్ని కేటాయిస్తే ఆరు కట్టొచ్చు. దుబాయ్‌లో 163 అంతస్తులతో మేఘాలను తాకుతున్న ఈ భవనం ఎత్తు.. 829 మీటర్లు. 2004 నుంచి వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తే.. 2010కి నిర్మాణం పూర్తైంది. ఇప్పటి వరకు మానవుడి చేతిలో నిర్మితమైన అద్భుతమేదైనా ఉందా అంటే అది బుర్జ్‌ ఖలీఫానే అని చరిత్రకారులు అంటున్నారు. గంగ్నమ్‌ డ్యాన్స్‌ చూడ్డానికి వృథా చేసుకున్న సమయంలో ఇలాంటి అద్భుత కట్టడాలను ఆరు కట్టొచ్చంటే మాటలుకాదు..

గంగ్నమ్‌ కోసం 16వేల సంవత్సరాలకు సమానమైన సమయాన్ని వృథా చేసుకున్న జనం.. ఈ సమయంలో ప్రపంచ అద్భుతాల్లో మొదటి స్థానంలో నిలిచే ఈజిప్ట్‌ పిరమిడ్లను నాలుగు కట్టొచ్చు. క్రేన్‌లు కూడా మోయలేంత బరవైన రాళ్లు, పెద్దపెద్ద ఇటుకలతో కట్టిన ఈ మహాకట్టడాన్ని ఇప్పటి టెక్నాలజీతో కూడా కట్టలేమని శాస్త్రవేత్తలు తేల్చేశారు. అంతటి గొప్ప కట్టడాలను  గంగ్నమ్‌ స్టైల్‌ కోసం వెచ్చించిన సమయంలో నాలుగు కట్టొచ్చంటే ఎంత విలువైన సమయం వృథా అయ్యిందో అర్థమవుతుంది.

గంగ్నమ్‌ స్టైల్‌ అంటూ వృథా చేసుకున్న సమయంలో.. యూఎస్‌ సూపర్ఎయిర్‌క్రాప్ట్‌ క్యారియర్లు మూడు తయారుచేయొచ్చు.. 75కు పైగా యుద్ధవిమానాలు ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉన్న ఈ భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను తయారుచేయడానికి.. 16బిలియన్ల డాలర్లు ఖర్చయ్యింది. 337 మీటర్ల పొడవైన ఈ భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను తయారు చేయడానికి 50 మిలియన్‌ల గంటల సమయం పట్టింది.

మానసిక ఉల్లాసం, సంతోషం కోసం సాంగ్స్‌ సినిమాలు చూడొచ్చుకానీ అదే వ్యసనంగా చూస్తే.. రికార్డులతో పాటు భారీ నష్టమూ జరుగుతుంది. తిరిగి సంపాదించలేనంత మూల్యం చెల్లించుకోవాల్సివుంటుంది.

Advertisements
Video | This entry was posted in International and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s