- టీటీడీపీ ఎల్పీ నేతపై కొనసాగుతున్న సస్పెన్స్
- చంద్రబాబు నిర్ణయానికి వదిలేసిన లీడర్లు
- శనివారం సాయంత్రం ప్రకటించే ఛాన్స్
- తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్
- 2019లో అధికారం తమదేనని ధీమా
- తెలంగాణపై ఫోకస్ పెడతానని బాబు హామీ
తెలంగాణ టీడీపీఎల్పీ నేతపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఏకాభిప్రాయం రాకపోవడంతో చంద్రబాబుకే నిర్ణయాధికారాన్ని టీ-ఎమ్మెల్యేలు కట్టబెట్టారు. అటు తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు విశ్రమించబోనని బాబు శపథం చేశారు.
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్షనేత ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాధికారాన్ని అధినేత బాబుకే వదిలేశారు. ఐతే..ఎర్రబెల్లి, తలసానిలో ఒకరికి పదవి ఖాయమవచ్చని ప్రచారం జరుగుతోంది. అటు ఆర్. కృష్ణయ్య పేరు కూడా బాబు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ అధికారికంగా బాబు ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు విశ్రమించబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని… మిగులు బడ్జెట్ సాధ్యమైందన్నారు. హైదరాబాద్లో ఆదాయాన్ని పెంచి సంపద సృష్టించామన్నారు. ప్రత్యేక తెలంగాణను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, సున్నితమైన సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని మాత్రమే కోరానన్నారు. హామీలు నెరవేర్చే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్యకర్తలకు బాబు పిలుపునిచ్చారు. వారంలో ఒకరోజు తెలంగాణకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.