సీమాంధ్ర టీడీపీలో నిరసనలు…మంత్రి పదవులు రాకపోవడంపై అలక

  • సీమాంధ్ర టీడీపీలో నిరసనలు
  • మంత్రి పదవులు రాకపోవడంపై అలక
  • గంపెడాశలు పెట్టుకున్న సీనియర్లు
  • సామాజిక వర్గ కూర్పులో దక్కని పదవులు
  • అసంతృప్తి వ్యక్తంచేసిన కార్యకర్తలు

 

చంద్రబాబు సర్కారులో మంత్రి పదవులు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్నవారికి నిరాశే మిగిలింది. దీంతో వారి అనుచరగణం వీరంగం వేస్తోంది. సీమాంధ్ర టీడీపీలో చాలామంది సీనియర్లకు అమాత్యయోగం దక్కలేదు. వీరంతా లోలోపల రగిలిపోతున్నా..పైకి మాత్రం అలాంటిదేమీ లేదంటూ కవర్ చేసుకుంటున్నారు. ఐతే.. కేడర్ మాత్రం తమ ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతోంది.

మంత్రిపదవులు రాకపోవడంపై టిడిపిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సీనియర్  శాసనసభ్యులకు పదవులు రాకపోవడంతో కార్యకర్తలు పైరవుతున్నారు. గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాదరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, మోదుగుల వేణుగోపాలరెడ్డికి బాబు కేబినెట్లో చోటు దక్కలేదు. దీంతో వారి అనుచరగణం తీవ్ర అసంతృప్తికిలోనైంది. ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన రావెల కిషోర్ కు మంత్రి పదవులు వచ్చాయి. ఎన్నికల సమయంలో మోదుగులకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు తన హామీని తుంగలో తొక్కారని మోదుగుల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ అనుచరులు కూడా నిరసన వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాలో కూడా సీనియర్లకు బాబు షాకిచ్చారు. దేవినేని ఉమకు మాత్రమే కేబినెట్ బెర్త్ లభించింది. కొత్తగా ఎన్నికైన కొల్లు రవీంద్ర లక్కీగా మంత్రయ్యారు. ఐతే..ఎన్నో ఆశలు పెట్టుకున్న కాగిత వెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే.. సామాజిక వర్గ కూర్పులో కొందరికి చోటివ్వలేకపోయారని.. అన్నివర్గాలకూ  స్థానం కల్పించాల్సి ఉండడంతో సీనియర్లకు పదవులు రాలేదని మరికొందరు నేతలు అంటున్నారు. ఐతే కేడర్ మాత్రం రగిలిపోతోంది.

మిగిలిన జిల్లాలలో కూడా అమాత్య పదవిపై గంపెడాశ పెట్టుకున్న ఆశావహులు నిరాశకు గురయ్యారు.

వీరందరి సేవలను పార్టీ, ప్రభుత్వంలో వివిధ రూపాలలో ఉపయోగించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s