అంతులేని నిర్లక్ష్యం.. కొన ప్రాణాలతో ఉన్న వారినీ గుర్తించలేరు

హిమాచల్ యంత్రాంగం అంతులేని నిర్లక్ష్యం..
– కొన ప్రాణాలతో ఉన్న వారినీ గుర్తించలేరు..
– మమ అనిపించుకునే ప్రయత్నం చేశారు..
– రెండు రాష్ట్రాల మంత్రులు, కేంద్రమంత్రుల రాక..
– లార్జీ డ్యాం దగ్గర పరిస్థితి సమీక్షించిన వీరభద్రసింగ్
– సుమోటోగా స్వీకరించిన హిమాచల్ హైకోర్టు
– జూన్ 17 కల్లా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం…
– ముగ్గురు ఉన్నతాధికారుల సస్పెన్షన్..
– నిజంగానే సైరన్ మోగితే సస్పెండ్ ఎందుకు చేసినట్లు?
– ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ తీవ్ర సంతాపం
– బాధిత కుటుంబాలకు సోనియా ప్రగాఢ సానుభూతి
– విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటాంః ఏపీ సీఎం చంద్రబాబు

బియాస్ నదీ దుర్ఘటనలో.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. గాలింపు చర్యలపై సకాలంలో స్పందించకుండా.. మమ అనే ప్రయత్నం చేసింది. అయితే.. తెలంగాణ, ఏపీ మంత్రులు, కేంద్రం అప్రమత్త సందేశాలతో వీరభద్రుడి సర్కారు మొద్దు నిద్ర వీడింది. మీడియా హడావుడి పెరగడంతో.. విశ్వప్రయత్నాలు చేస్తున్నామని కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.


VNR విజ్ఞాన్‌ జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. హెచ్చరికలు లేకుండానే డ్యాంగేట్లు ఎత్తేయడం.., 24 మంది విద్యార్థులు గల్లంతవడం.., వారిని రక్షించే క్రమంలో హిమాచల్ ప్రభుత్వ యంత్రాంగాల అంతులేని నిర్లక్ష్యం.. ప్రమాద తీవ్రతను పెంచేసింది. 24 మంది విద్యార్థుల ఆచూకీ కనిపెడదామన్న కనీసం ఆలోచన లేకుండా ప్రవర్తించారు అక్కడి అధికారులు. కొన ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించే ప్రయత్నమూ చేయలేదు. మమ అనిపించుకునే యత్నం చేయగా.. తెలంగాణ హోంమంత్రి నాయిని సహా.. ఏపీ మంత్రులు అక్కడి చేరుకోవడం.. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, అశోక్ గజపతి రాజు ఘటనా స్థలికి వెళ్లడంతో సీన్ మారింది. దీంతో హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్….. లార్జీ డ్యాంకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చేదాకా.. గాలింపు చర్యల్లో అడుగు ముందుకేయలేకపోయారు. ఈ వ్యవహారంపై హిమాచల్ హైకోర్టు కూడా సీరియస్ అయిందంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల గల్లంతు వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. జూన్ 17 కల్లా రిపోర్ట్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థుల గల్లంతు సీరియస్‌గా మారడంతో.. హిమాచల్ సీఎం వీరభద్ర సింగ్.. ముగ్గురు లార్జీ డ్యాం ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి అప్పటికప్పుడు.. చేతులు దుపులుకొన్నారు. ఉన్నతస్థాయి విచారణకూ ఆదేశించారు. డ్యాంగేట్లు ఎత్తే ముందు సైరన్ మోగిందని చెప్పుకొచ్చారు. మరి అంతా పద్దతి ప్రకారం జరిగినప్పుడు అధికారులను సస్పెండ్ ఎందుకు చేశారో వీరే చెప్పాలి.

ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. అధికారుల తప్పు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని హిమాచల్ ప్రభుత్వానికి సూచించారు. నదీ ప్రవాహంలో గల్లంతయిన తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులకు అన్నివిధాలా అండదండగా నిలుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కన్నబిడ్డల మృతదేహాల కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతమనీ, వారి బాధ ఆలకిస్తుంటే కళ్ళు చెమరుస్తున్నాయనీ ఆయన అన్నారు.

సైరన్ మోగలేదని.. అందుకే విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారని టీ.హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని.. అందరినీ స్వస్థలాలకు పంపుతామని అన్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో విద్యార్థుల గల్లంతు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. కేంద్రంతోను తాము టచ్‌లో ఉన్నామన్నారు. సహాయక చర్యలు ముగిసే వరకు బాధితుల తల్లిదండ్రులు హిమాచల్‌ ప్రదేశ్‌లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్టు హరిష్‌రావు చెప్పారు.

మొత్తంగా జరగాల్సిన ఘోరం జరిగిపోయాక.. హిమాచల్ సర్కారు స్పందించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s