* టి-కాంగ్రెస్ డిన్నర్ పాలిటిక్స్. ..

* టి-కాంగ్రెస్ డిన్నర్ పాలిటిక్స్.
జానారెడ్డి గోల్కోండ హోటల్లో విందు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు
సభలో అనుసరించా్లసిన వ్యూహం, సభ్యుల మధ్య సమన్వయం

తెలంగాణ ఇచ్చినా జనం ఆదరించలేదు. అతి కష్టం మీద ప్రతిపక్ష హోదా దక్కింది. అందుకే జనంపై కసిగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు భవిష్యత్‌పై మాత్రమే దృష్టి సారించారు. రుణ మాఫీ అమలు కాదన్న బాధతో అన్నదాతలు మృత్యువాత పడినా పెద్దగా పట్టించుకోలేదు. హిమాచల్‌ ప్రదేశ్‌లో 24 మంది స్టూడెంట్స్‌ గల్లంతైనా ప్రతిపక్షంగా ఏం జరుగుతుందో తెలుసుకునే కనీస ప్రయత్నం చేయలేదు. డిన్నర్‌ పార్టీ పెట్టుకుని జల్సా చేయడం వివాదస్పదమైంది.

జనమంటే ఇప్పుడు కాంగ్రెస్‌కు అదో టైప్‌ ఆఫ్‌ మంట. ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా జనం ఈసడించుకున్నారు. ఎన్నికల్లో ఓటు వేయక పరవు తీశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత ఘోరంగా ఓడించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో అధికారం గ్యారంటీ అనుకున్నారు. తీరా ఫలితాలు తారుమారయ్యాయి.
TRS ఆధ్వర్యంలో కేసీఆర్‌ ప్రభుత్వం కొలువు దీరింది. రుణ మాఫీపై చేసిన ప్రకటన గందరగోళం సృష్టించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల్లో అయోమయం నెలకొంది. లక్ష వరకే మాఫీ చేస్తామన్న ఆవేదనతో చాలా మంది రైతుల గుండెలు ఆగాయి. ప్రతి జిల్లాలో మరణ మృదంగం మోగింది. అయినా ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ కనీసం స్పందించలేదు. క్షేత్ర స్థాయికి వెళ్లి మేమున్నామన్న భరోసా కల్పించలేదు. పైగా విపక్షానికి దక్కే అరకొర పదవుల కోసమే అర్రులు చాచారు. అండగా ఉంటామన్న ధీమా అన్నదాతలకు కల్పించాలన్న కనీస ఇంగితం మరిచిపోయారు.Spot
విపక్షనేతగా ఎన్నికైనందుకు జానారెడ్డి నిన్న రాత్రి గోల్కొండ హోటల్లో MLAలు, MLCలతోపాటు పలువురు సీనియర్లకు గ్రాండ్‌ పార్టీ అరెంజ్‌ చేశారు. అసెంబ్లీ, మండలిలో వ్యూహంపై చర్చిస్తామని కలరింగ్‌ ఇచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో 24 మంది తెలుగు విద్యార్థుల అదృశ్యంపై మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు కనీసం స్పందించేందుకు సమయం దొరకలేదు. డిన్నర్‌ భేటీ ఎందుకంటే… నిస్సిగ్గుగా… భవిష్యత్‌ వ్యూహంపైనే అంటూ సెలవిచ్చారు కాంగ్ నేతలు.


అయితే హిమాచల్‌ ఘటనపై విపక్ష పార్టీగా ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి గీతారెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే… ఇప్పుడు దానిపైనే చర్చిస్తామంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పైగా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని జానా రెడ్డి తరహాలో ఓ డైలాగ్‌ చెప్పి జారుకున్నారు. పనిలో పనిగా ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలంటూ భాష్యం చెప్పారు.

మాంచి డిన్నర్‌ పార్టీ ఇచ్చిన విపక్షనేత, సీనియర్‌ లీడర్‌ అయినా జానా రెడ్డి, TPCC చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య హిమాచల్‌ ఘటనపై కనీసం పెదవి విప్పలేదు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు నానా హైరానా పడుతుంటే టీ కాంగ్‌ నేతలు పార్టీ చేసుకోవడంపై విమర్శలు విన్పిస్తున్నాయి.

Advertisements
Video | This entry was posted in Telangana and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s