లోక్‌సభలో బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌… రాజీవ్‌ ప్రతాప్‌రూఢీతో ఖర్గే సంవాదం

– కాంగ్రెస్‌ను కార్నర్ చేసిన రాజీవ్ ప్రతాప్
– యూపీఏకు ప్రతిపక్ష హోదా కూడా లేదన్న రూఢీ
– తమ ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరిని సంప్రదించాలి?
– రూఢీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఖర్గే..
– కాంగ్రెస్ ఎంపీలను పాండవులతో పోలిక..
– వందమంది కౌరవుల ముందు భయపడలేదని వ్యాఖ్య

పార్లమెంట్‌ ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పే క్రమంలో… బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలాయి. చర్చను ప్రారంభించిన బీజేపీ సీనియర్ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ.. ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే.. కాంగ్రెస్‌పై వ్యంగ్యాత్మక విమర్శలు చేశారు. దీంతో కల్పించుకున్న కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే కూడా.. దీటుగానే జవాబివ్వడంతో.. సభలో కాసేపు హీట్‌వేవ్ కనిపించింది.

రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడాల్సిన బీజేపీ కాంగ్రెస్ సభ్యులు.. కురుక్షేత్ర యుద్ధం, మహాభారతం వరకూ వెళ్లారు. ప్రణబ్ ప్రసంగానికి ధన్యవాదం చెప్పే క్రమంలో ఈ రెండు పార్టీల సభ్యుల మధ్య చర్చ పక్కదారి పట్టింది. సభలో తొలుత మాట్లాడిన బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ.. తమ ప్రభుత్వ గొప్పతనాన్ని వివరిస్తూనే.. కాంగ్రెస్‌ను సున్నితంగా కార్నర్ చేశారు. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. దాంతో, తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియడంలేదని రూఢీ వ్యాఖ్యానించారు. అయితే, బాధపడాల్సిన అవసరంలేదని… తాము ప్రతి ఒక్కరిని సంప్రదిస్తామని, ఎందుకంటే తమ ప్రధాని విశాల హృదయం కలవారని చెప్పుకొచ్చారు.

బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పాండవులతో పోల్చుకున్నారు లోక్ సభలో ఆ పార్టీ పక్షనేత మల్లికార్జున ఖర్గే. ఇందుకు మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుని విశ్లేషించుకున్నారు. ‘లోక్ సభలో తాము 44 మంది ఎంపీలు ఉండవచ్చు. కానీ, పాండవులెప్పుడూ వందమంది కౌరవుల ముందు భయపడలేదు’ అని కౌంటర్ ఇచ్చారు.

ఈ మాట చెప్పగానే.. సోనియా బల్లచరిచి.. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా తక్కువ సంఖ్యలో ఉన్న పాండవులదే అంతిమ విజయమని ఖర్గే చెప్పకనే చెప్పారు. అధికారం ఎప్పుడూ ఉంటుందన్న భ్రమ వద్దని హితవు పలికారాయన. బీజేపీ నేతలు మార్కెటింగ్ సహా ప్రచారం చేసుకోవడంలో ఆరితేరిపోయారని.. అయితే.. ప్రతి పనినీ ఆచరణలో ఎలా చూపుతారో చూస్తామని ఖర్గే చెప్పుకొచ్చారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s