– నీటి ఉధృతితో గాలింపు చర్యలకు ఆటంకాలు
– దేవాశిష్‌ బోస్‌ మృతదేహం వెలికితీత..
– పండూ డ్యాంలో దేవాశిష్‌ మృతదేహం లభ్యం
– ఇప్పటి వరకూ దొరికినవి ఐదు మృతదేహాలే
– లార్జి నుంచి పండూ డ్యాం వరకు అణువణువూ శోధన
– 84 మంది విపత్తు నిర్వహణ సభ్యలు
– 10 మంది గజ ఈతగాళ్ల గాలింపు..
– ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హిమాచల్
– రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
– గాలింపు ముమ్మరం చేయాలని హిమాచల్ సీఎంను కోరిన చంద్రబాబు
– హెచ్చరికల్లేకుండానే డ్యాంగేట్లు ఎత్తారుః నాయిని
– మండి కలెక్టర్‌తో నాయిని, నారాయణ సమీక్ష
– ఆధునిక పరిజ్ఞానంతో మృతదేహాలు వెలికి తీయాలని పేరెంట్స్ డిమాండ్
– వెలికితీత పూర్తయ్యాక పీఎం, టీ.సీఎంకు నివేదిక ఇస్తాంఃనాయిని
– దేవాశిష్ బోస్ మృతదేహం హైదరాబాద్ చేరిక
– హెచ్చరిక బోర్డులు లేవన్న మండి కలెక్టర్..

హిమాచల్‌ప్రదేశ్‌ బియాస్‌నదిలో గల్లంతయిన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. మంగళవారం దేవాశిష్ బోస్ మృతదేహం మాత్రమే దొరికింది. మొత్తం 24 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకూ ఐదుగురి మృతదేహాలు మాత్రమే దొరికాయి. మిగితావారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. నీటి ప్రవాహ ఉధృతి పెరగడం.., హిమనీనదం మరింత చల్లగా ఉండడంతో లోతుకు వెళ్లి వెతికే పరిస్థితులు కనిపించడం లేదు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం.. తమ బిడ్డల కోసం బియాస్ నది ఒడ్డున పడిగాపులు కాస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌ బియాస్‌నదిలో గల్లంతయిన 24 మంది విద్యార్థుల్లో 19 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలను తాత్కాలింగా ఆపేశారు. మంగళవారం ఉదయం ఓ మృతదేహాన్ని వెలికితీశారు. బాగ్‌ అంబర్‌పేటకు చెందిన దేవాశిష్‌ బోస్‌గా గుర్తించారు. పండూ డ్యామ్‌కు 100 మీటర్ల దూరంలో దేవాశిష్‌ మృతదేహం బయటపడింది. దీంతో ఇప్పటిదాకా దొరికిన మృతదేహాల సంఖ్య ఐదుకు చేరింది. లార్జి డ్యాం నుంచి పండూ డ్యామ్‌ దాకా దాదాపు 18 కిలోమీటర్లు అణువణువూ గాలించినా ఎవరి జాడనూ కనిపెట్టలేకపోయారు.

84 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, 10 మంది గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. కొండల్లోని మంచు విపరీతంగా కరగడం.. ఆ నీరు చల్లగా ఉండటం వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తోంది. దీంతో గాలింపు తాత్కాలికంగా నిలిపేశారు. మరణించిన ఒక్కో విద్యార్థుల కుటుంబానికి హిమాచల్ ప్రదేశ్ సర్కారు రూ. 1.5 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని నిర్ణయించారు. గాలింపు చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌తో చంద్రబాబు ఫోన్‌లో సంప్రదించారు. గల్లంతైన విద్యార్థుల వెలికితీతకు సహాయకచర్యలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.

ముందస్తు హెచ్చరికల్లేకుండానే లార్జి డ్యాం గేట్లు ఎత్తేశారని.. టీ. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్… మండి జిల్లా కలెక్టర్‌తో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, నారాయణ సమీక్షించారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించి, సత్వరం మృత దేహాలను వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. నిపుణుల సలహాతో మృతదేహాల వెలికితీతపై ముందుకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. నీటి కింది భాగానికి వెళితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని చెప్పారు. వెలికి తీత పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, తెలంగాణ సీఎం కెసిఆర్‌కు నివేదిక సమర్పిస్తామని నాయిని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి దేవశిష్ బోస్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. అతని తల్లిదండ్రులు కూడా అదే విమానంలో వచ్చారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు సరిపడాలేవని హిమాచల్ మండి కలెక్టర్‌ దేవేష్‌ కుమార్ అంగీకరించారు. ఇకపై పర్యాటకులను అప్రమత్తం చేయడంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని  దేవేష్‌ కుమార్‌ చెప్పారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News, Telangana and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s