ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైసీపీ మరికాసేపట్లో భేటీ అవుతోంది. జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోటస్ పాండ్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న వైసీపీ.. సర్కారును ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్ నుంచి సీమాంధ్రలో ప్రధాన ప్రతిపక్షపాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోషించబోతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోటస్ పాండ్ లో సమావేశమవుతున్నారు. వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న వైసీపీ.. టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకు పెట్టేందుకు అస్తశస్త్రాలు సిద్ధం చేస్తోంది.
ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అచరణ సాధ్యం కావంటూ ముందు నుంచి చెబుతున్న వైసీపీ… ఆ హామీలనే తమ ఆయుధాలుగా మార్చుకోబోతోంది.
ముఖ్యంగా టీడీపీ ఇచ్చిన హామీల్లో రైతురుణాలు, డ్వాక్రా రుణాలు అతి ముఖ్యమైనవి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని.. రైతు రుణాలన్నీ ఆంక్షలు లేకుండా మాపీ చేయాలని ఇప్పటికే జగన్.. సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే రైతు, డ్వాక్రా రుణాలు మాపీ చేస్తామంటున్న సీఎం చంద్రబాబు.. సాధ్యసాధ్యాలపై తర్జనభర్జన పడుతున్నారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం రుణమాఫీలపై చేస్తామని ప్రకటించిన బాబు.. ఇప్పటి వరకు వాటని మాఫీ చేయలేదనే అంశాన్ని వైసీపీ ప్రధానంగా లేవనెత్తబోతోంది.
తొలి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టెందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైసీపీ మనసావాచ సిద్ధమవుతోంది.