అదే చిరునవ్వు.. అదే హుందాతనం..సభలో అందరినీ ఆకట్టుకున్న జగన్‌

  • విపక్ష నేతగా జగన్‌ హూందా
  • టీడీపీ 90 శాతం హామీలు చర్చనీయాంశాలే..
  • ప్రతిపక్షానికి ఐదేళ్లూ చేతినిండా పనే..
  • ఎమ్మెల్యేలకు జగన్‌ దిశానిర్దేశం
  • పోరాటం పోరాటమే.. సంప్రదాయం సంప్రదాయమే..
  • బాధ్యతగల ప్రతిపక్షంగా వైసీపీ
  • తొలిరోజు చిరునవ్వులతో జగన్‌
  • స్పీకర్‌ ఎన్నిక విషయంలోనూ పరిణతి
  • సభా సంప్రదాయాలను గౌరవించిన జగన్‌

 

వైసీపీ అధ్యక్షుడిగా జగన్‌ ఎలా రాణించారో.. ప్రతిపక్షనేతగానూ అదే రీతిలో ప్రూవ్‌ చేసుకోనున్నారు. బాధ్యతగల విపక్షంగా  వ్యవహరిస్తూనే.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఏమాత్రం వెనకడుగు ఉండకపోవచ్చు. హుందాతనం పాటిస్తూనే.. కొన్ని విషయాల్లో మొండిగానూ ఉండేందుకు సిద్ధమవుతున్నారు.

చట్టసభలో ప్రధాన ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి… ఆ వర్గానికి నాయకుడంటే ఎలా వ్యవహరించాలి..? సభలో అధికార పక్షం అవలంభించే ప్రజావ్యతిరేక విధానాలను ఎంతగట్టిగా విమర్శిస్తారో…. సర్కారు చేసే మంచి పనులను అంతే బలంగా సమర్థించాలి. సంప్రదాయాలను గౌరవించాలి. సభ హూందా తనాన్ని పెంచాలి. అప్పుడే సరైన ప్రతిపక్షమని.. దాని నాయకుడు… అసలైన ఆపోజిషన్‌ లీడరని అనిపించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ విపక్ష నేత జగన్‌ సరిగ్గా అలాగే వ్యవహరించారు. మొదటిరోజు ప్రవర్తనతోనే తన హూందాతనాన్ని చాటిచెప్పారు.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీడీపీ ఎన్నో హామీలిచ్చింది. అందులో దాదాపు 90 శాతం హామీలు చర్చనీయాంశాలే. ఈ లెక్కన ప్రతిపక్షానికి ఐదేళ్లూ చేతినిండా పనే. పైగా రాష్ట్ర విభజన పరిస్థితుల్లో టీడీపీ హామీలు నెరవేర్చాలంటే అద్భుతమే జరగాలి. ఈ విషయాన్ని ముందే గుర్తించిన ప్రతిపక్షనేత జగన్‌… ఏం చేయాలో.. సభలో ఎలా వ్యవహరించాలో.. పార్టీ సభ్యులకు ముందుగానే వివరించారు. సర్కారు తీసుకునే అన్ని నిర్ణయాలపై తమదైన లిట్మస్‌ టెస్టు చేయాలని డిసైడయ్యారు. ఇవాళ్టి నుంచి సభలో దాదాపు అలాగే వ్యవహరిస్తారు. అయితే పోరాటం పోరాటమే.. సంప్రదాయం సంప్రదాయమే అన్నది పాటించి.. తనలోని రాజకీయ విలువల స్థాయి ఏ పాటిదో జగన్‌ నిరూపించారు.

తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్‌ తన హూందా తనాన్ని వెల్లడించారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ఉంటామని చెప్పేలా.. టీడీపీ ప్రభుత్వానికి చిరునవ్వులతో స్వాగతం పలికారు. మరోఅడుగు ముందుకేసి.. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు షేక్‌హ్యాండ్‌ కూడా ఇచ్చి.. తన మెచ్యూరిటీని చాటుకున్నారు. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తడంతో పాటు.. అందరి అభిమానం చూరగొన్నారు.

ఇక అత్యంత కీలకమైన స్పీకర్‌ ఎన్నిక విషయంలోనూ జగన్‌ అదే స్థాయి పరిణతి కనబర్చారు. వాస్తవానికి బలమైన 66 మందితో బలమైన ప్రతిపక్షంగా ఉన్న  వైసీపీ… కావాలనుకుంటే అధ్యక్ష స్థానానికి అభ్యర్థిని నిలబెట్టొచ్చు. కానీ రాజకీయాలకు అతీతమైన స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైతేనే బాగుటుందని నమ్మిన వ్యక్తిగా.. జగన్‌ సంప్రదాయాలను గౌరవించారు. సీనియర్‌ నాయకుడైన కోడెల అభ్యర్థిత్వానికి బేషరతుగా మద్దతు పలికి.. మంచి ప్రతిపక్ష నేతగా మార్కులు కొట్టేశారు.

భవిష్యత్తులోనూ  సభలో తమ పాత్ర ఇలాగే ఉంటుందని.. జగన్‌ స్పష్టం చేశారు. మంచిని సమర్థిస్తూనే… చెడును ఎండగడతామని తేల్చిచెప్పారు. మొత్తమ్మీద ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలని అందరూ చెప్పుకునేలా తమ పార్టీ వ్యవహరిస్తుందని యువనేత మొదటి రోజే చాటిచెప్పారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s