ఇంకా కోలుకోని నగరం…మారుమోగుతున్న మృత్యుఘోష

  • ఇంకా కోలుకోని నగరం
  • మారుమోగుతున్న మృత్యుఘోష
  • కాకినాడ అపోలోలో ఏడుగురు
  • ట్రస్ట్‌ హాస్పిటల్ లో ముగ్గురు
  • సాయిసుధ హస్పిటల్ లో ఒకరు
  •  అమలాపురం కిమ్స్ లో ఏడుగురు
  • దుర్భరంగా క్షతగాత్రుల పరిస్థితి
  • ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న క్షతగాత్రులు
  • ఒళ్లు కాలిన బాధ, మరోవైపు ధ్వంసమైన గూడుతో ఆవేదన
  • ఉపాధి కోల్పోవడంతో నగరం వాసుల కలవరం
  • ప్రమాదంలో దెబ్బతిన్న  పక్కా భవనాలు
  • బీటలు వారిన గోడలు
  • మాడి మసైపోయిన గుమ్మాలు, తలుపులు
  • ప్రమాదంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు
  • తొలిరోజే ఓఎన్జీసీ కలెక్షన్‌ సెంటర్‌పై దాడి  

కోనసీమ ప్రాంతాన్ని స్మశానంగా మార్చిన గ్యాస్‌ పేలుడు జరిగి ఆరు రోజులు కావస్తున్నా… నగరం ఇంకా తేరుకోలేకపోతోంది. రెండుగంటల వ్యవధిలో సర్వం బూడిద చేసిన గ్యాస్ మంటలు ఇంకా వారి కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య పెరుగుతుండడం నగరం గ్రామస్ధులను మరింత కలవరానికి గురిచేస్తోంది. దీనికితోడు ఉపాధినిచ్చే దుకాణాలు, కొబ్బరి చెట్లు కూడా దగ్ధమవడంతో స్థానికులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఆగ్రహంతో ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్‌ గ్యాస్ పైప్‌లైన్ పేలి ఆరు రోజులవుతోంది. అయితే ఇంకా ఆ గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. మృత్యుఘోష మారుమోగుతూనే ఉంది. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో 13 మంది సజీవ దహనమయ్యారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కూడా చనిపోతున్నారు. ఇప్పటికీ కాకినాడ అపోలోలో  ఏడుగురు, ట్రస్ట్‌ హాస్పిటల్ లో ముగ్గురు, సాయిసుధ హాస్పిటల్ లో ఒకరు, అమలాపురం కిమ్స్ లో మరో ఏడుగురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో  ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనని నగరం గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.

ఇక తీవ్రంగా గాయపడినవారి పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. గ్యాస్ మంటల వల్ల ఒళ్లంతా కాలిపోవడంతో వారు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. స్వల్పగాయాలతో బయటపడినవారి పరిస్థితి కూడా దాదాపుగా ఇలానే ఉంది. ఒకవైపు ఒళ్లు కాలిన బాధకు తోడు, నిన్నటి వరకు గూడు కల్పించిన గృహాలు ధ్వంసం కావడం వారిని కలిచివేస్తోంది. ఇక ప్రమాదంలో సుమారు 848 కొబ్బరి చెట్లు మాడి మసైపోయాయి. ఒక చెట్టు మీద ఏడాదికి వెయ్యి రూపాయల దాకా ఆదాయం వస్తుంది. దీంతో నోటికాడ కూడు దూరమైందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక ప్రమాదం వల్ల రోజువారి ఆదాయం కోల్పోయిన హోటల్ యజమానులు, పాన్‌షాప్ వర్తకులు దుస్థితి అంతాఇంతా కాదు.

గ్యాస్‌ ప్రమాదంలో పూరిపాకలే కాదు.. పక్కా భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు తీవ్రతకు గోడలు బీటలు వారాయి. ఫ్లోరింగ్ ధ్వంసమైంది. గుమ్మాలు, తలుపులు మాడి మసైపోయాయి. ప్రమాదంలో మొత్తం 12 ఇళ్లు దగ్ధమవగా, ఇందులో ఆరు పక్కా భవనాలు, ఒక పెంకుటిల్లు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, నాలుగు పూరిళ్లు ఉన్నాయి. బీటలు వారిన ఇళ్లు ఎంతోకాలం ఉండవని, ఉన్నా అవి నివాసయోగ్యం కాదని బాధితులు చెబుతున్నారు. నగరం దుర్ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. మానవ తప్పిదం కారణంగానే ప్రమాదం జరగడం, ముందు నుంచి హెచ్చరిస్తున్నా గెయిల్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే కోనసీమ మృత్యుసీమగా మారిందని స్థానికులు ఊగిపోతున్నారు. అందుకే ప్రమాదం జరిగిన తొలిరోజు తాటిపాకలో ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్ పై వారు దాడికి యత్నించారు. అంతేకాదు  తమ ఆగ్రహాన్ని ప్రజాప్రతినిధులపై చూపుతున్నారు. పరామర్శలకు వస్తున్న నాయకులను నిలదీస్తున్నారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న నాయకులు చమురు సంస్థలకు అమ్ముడు పోవడం వల్లే తమకు ఈ దుస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s