చెన్నై ప్రమాదంలో పెరుగుతున్న మృతులు… శిథిలాలను తొలగించేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్

చెన్నై దుర్ఘటనలో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు 22 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల తొలగింపునకు మరింత సమయం పడుతుందున్న అధికారుల ప్రకటనతో బాధిత బంధువులు కలవరపడుతున్నారు. మరోవైపు ఘటనాస్థలంలో బాధితు బంధువులను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

చెన్నై బిల్డింగ్ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శిథిలాలను తొలగిస్తున్న కొలది మృతదేహాలు బయటపడుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులవుతున్నా ఇంకా సహాయచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సెర్చ్ అపరేషన్ పూర్తయ్యేందుకు  మరో నాలుగైదు రోజుల పట్టవచ్చని అధికారులు చెప్పారు.

చెన్నైలో భవనం కుప్పకూలిన ప్రాంతాన్నిపరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు సహాయచర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి  ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇకపై ఏపీ కూలీలకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఏపీ కాంగ్రెస్ నేతలు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య కూడా సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు పది లక్షల రూపాయిల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు డిమండ్ చేశారు. ప్రమాద ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు శిథిలాల తొలగింపు ఆలస్యం అవుతుండటంతో బాధిత బంధువల్లో ఆందోళన పెరుగుతోంది.  ఘటనాస్థలంలో మూడు రోజులుగా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబీకులు తమవారు బతికున్నారో లేదో తలియక తల్లడిల్లుతున్నారు. రోజులు గడుస్తుండటంతో  తమవారి ప్రాణాలపై కలవరపడుతున్న బాధిత బంధువులు సహాయచర్యలను మరింత వేగవంతం చేయాలని కోరుతున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, National and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s