తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ముఖ్యనేతలంతా వెంటరాగా ఆయన అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీగూటికి చేరడంతో మండలిలో టీఆర్ఎస్ బలం 15కి చేరింది. వీరికి ఇద్దరు ఎంఐఎం సభ్యులు, ఓ స్వతంత్ర ఎమ్మెల్సీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం 35 మంది సభ్యులున్న మండలిలో ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే స్వామిగౌడ్ గెలుపు ఖాయమని స్పష్టమౌతోంది. ఐతే, కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఫరూఖ్‌ను నిలబెట్టాలని భావిస్తున్నందున ఎన్నిక అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు, హస్తం పార్టీ ఎమ్మెల్సీలు ఇవాళ అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు మౌనదీక్ష చేయనున్నారు. TRS అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ దానికి నిరసనగా దీక్షకు దిగుతున్నారు.
- (adsbygoogle = window.adsbygoogle || []).push({});
-
Recent Posts
Recent Comments
Archives
Categories
Advertisements