అనంతపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీకి చెందిన నాయకుడు ప్రకాశ్‌ని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఎల్లనూరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. రాత్రి 11 గంటల సమయంలో ప్రకాశ్‌ని ఫాలో అయి..
పక్కా స్కెచ్‌తో వేటకొడవళ్లతో నరికి చంపేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే అతను చనిపోయినట్టు డాక్టర్లు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఫ్యాక్షన్ హత్యకు మద్యం షాపు వివాదం కారణమైన ఉండొచ్చని భావిస్తున్నారు.
Advertisements