గుంటూరు జిల్లాలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. బాపట్లకు చెందిన నాంచారమ్మ అనే మహిళ పదేళ్లుగా చిటీల వ్యాపారం చేస్తోంది. నమ్మకంగా డబ్బులు ఇస్తుండటంతో ఒకరిని చూసి మరొకరు చీటీలు వేశారు. వందలాది మంది నుంచి దాదాపు రెండుకోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారు. రాత్రికి రాత్రి కుటుంబంతో పరారయ్యారు. నాంచారమ్మ ఇంటికి తాళం వేసి ఉండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
Advertisements