వరాల పథకాలా.. సంస్కరణ విధానాలా……మోడీ సర్కార్ తొలి బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ

అభివృద్ధి అజెండాతో ప్రధాని పీఠాన్ని దక్కించుకున్న మోడీ ఆ దిశగా ఎలాంటి విజన్‌తో అడుగులు వేయబోతున్నారు? నరేంద్రుడి హయాంలో తొలి బడ్జెట్ మరికొన్ని గంటల్లో పార్లమెంట్‌ ముందుకు రానుంది. న్యాయ నిపుణుడైన అరుణ్‌ జైట్లీకి ఆర్థికంపై అవగాహన ఎంత? జైట్లీ చిట్టా పద్దులు రైల్వే బడ్జెట్‌లా బోర్‌ కొట్టిస్తాయా? వరాలతో జోష్‌ నింపుతాయా?

మంచి రోజులు రాబోతున్నాయంటూ ప్రజల మనసు గెలుచుకుని ఢిల్లీలో పాగా వేసిన నరేంద్రుడు.. తొలి బడ్జెట్‌ని ఆ దిశగానే రూపొందించారా? గుజరాత్‌ తరహా అభివృద్ధిని దేశానికి ఎలా రుచి చూపించబోతున్నారు? మోడీ గుజరాత్‌లో ఉన్నప్పుడు ఆయనకు అన్నివిధాలా అండగా నిలిచిన అరుణ్‌జైట్లీయే ఇప్పుడు ఆర్థికమంత్రి. బీజేపీలో ఈయనకు ట్రబుల్‌ షూటర్‌గా కూడా పేరుంది.
యూపీఏ పదేళ్ల పాలనలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక రంగాన్ని అరుణ్‌ జైట్లీ ఎలా గాడిన పెట్టగలరో

బడ్జెట్‌లో తేలిపోనుంది. వాజ్‌పేయి హయాంలో న్యాయ, సమాచార-ప్రసార, పెట్టుబడుల ఉపసంహరణ, షిప్పింగ్‌, వాణిజ్య-పరిశ్రమలు వంటి కీలక శాఖలకు జైట్లీ మంత్రిగా చేశారు. సమర్థంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. అంటే.. దాదాపు అన్ని రంగాలపై అవగాహన ఉన్నట్టే. రక్షణ, ఆర్థికం వంటి భారీ పోర్ట్‌ఫోలియోల్ని చూస్తున్న

అందరూ ఎకనమిస్టులే.. కానీ ఆర్థిక రంగం మాత్రం దివాళీ తీసిందని గతంలో యుపిఎ ప్రభుత్వంపై బీజేపీ నిప్పులు చెరిగింది. సంకీర్ణ శకంలో తిరుగులేని మెజార్టీ సాధించిన ఎన్డీఏది.. ఐదేళ్ల పాటు ఆడిందే ఆట, పాడిందే పాట. మోడీ ఎలాంటి పాలసీ రూపొందించినా తిరుగుండదు. ఈ నేపథ్యంలో స్వల్పకాలిక లక్ష్యాలపైనే దృష్టి సారిస్తారా? దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. సంస్కరణల పథం తప్పదని ఆర్థిక సర్వేని సభముందు ఉంచిన సమయంలో జైట్లీ స్పష్టంగా చెప్పారు. రిఫామ్స్‌ అంటేనే ఓ చేత్తో ఇచ్చి.. మరో చేత్తో పుచ్చుకోవడం. ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేయబోమంటూ స్పష్టంగా చెప్పిన మోడీ టీమ్.. చేదుగుళికలకు సిద్ధంగా ఉండాలని చెప్పకనే చెప్తోంది. ఆ డోస్‌ ఏ రేంజ్‌లో ఉంటుందన్నది చూడాలి.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s